హైదరాబాద్‌లో కలకలం రేపిన చైల్డ్ ఫోర్నోగ్రఫీ
హైదరాబాద్‌లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ కలకలం రేపింది. అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో కలకలం రేగింది. చిన్న పిల్లల అశ్లీల వీడియోలను వాట్సాప్ ద్వారా వ్యాప్తి చేస్తున్న రామాంతపూర్ యువకుడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్‌కు చెందిన ఈ యువకుడు రామంతపూర్‌లో నివాసం ఉంటున్నట్లు లొకేషన్ ఆధారంగా కనిపెట్టారు సీఐడీ పోలీసులు. ఇలాంటి వీడియోలు ఎక్కడ అప్‌లోడ్ అయినా ఎక్కడ ఫార్వాడ్ అయినా అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటింగ్ సంస్థ వారికి తెలుస్తుంది. ఇలా దొరికిన సమాచారంతోనే దిల్లీలోని రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీనితో తెలంగాణా సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇలా 2019 నుండి భారత్, అమెరికాలకు చెందిన ఏజెన్సీల ఒప్పందం ప్రకారం పిల్లలకు చెందిన అశ్లీల వీడియోలను వ్యాప్తి చేసిన వారిని కనిపెట్టి సమాచారం అందిస్తున్నారు. ఈ వ్యక్తి తాను చూడడంతో పాటు తన స్నేహితులకు కూడా పంపేవాడని, రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఎంసీఏ చదువుతున్నాడని తెలుసుకున్నారు పోలీసులు.