వారికి ముఖ్యమంత్రి హెచ్చరిక..
తెలంగాణలో వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులకు కొన్నిసూచనలు, హెచ్చరికలు చేశారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి…
కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి..
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి..
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి.
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాం.
వర్షాల సమయంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలి…
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి…
విద్యుత్ సరఫరా లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలి.

25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే విదంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

