home page sliderHome Page SliderNational

ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. విజిలెన్స్ కు చిక్కిన చీఫ్ ఇంజనీర్

విజిలెన్స్ అధికారుల వలలొ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో దాడులు జరిపారు. ఇంజనీర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికాయి. 2 కోట్ల రూపాయలు పైగా నగదును అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బైకుంత నాథ్ బయటకు విసిరేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంత నాథ్ ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.