Home Page SliderTelangana

కాంగ్రెస్‌లోకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకిలిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పలవురు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బలమైన అభ్యర్థిని దింపాలని తాజాగా ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రంజిత్ రెడ్డికి చేవెళ్ల ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ ఎంపీలను గెలిచే విషయంలో రేవంత్ మాస్టర్ స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునానంటూ ఎక్స్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి సేవ చేసేoదుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ నాకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. తన ఆశ, శ్వాస చేవెళ్ల ప్రజలంటూ ఆయన ఎక్స్‌లో హెడ్డర్ పెట్టారు.