Home Page SliderTelangana

చర్లపల్లి రైల్వేస్టేషన్ కు పొట్టి శ్రీరాములు పేరు

హైదరాబాద్ లోని చర్లపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అందుకోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేక రాస్తానని అన్నారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుపై చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తెలుగు వర్సిటీ పేరు మార్పును రాజకీయం చేయడం తగదని అన్నారు. తెలంగాణ వైతాళికుడు సురవరం పేరు పెట్టడాన్ని కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను విమర్శించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలపై ఎలాంటి చిన్న చూపు లేదని, ఆయన త్యాగాలపై గౌరవంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆయన పేరు పెట్టుకుందామని అన్నారు. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరున ఉన్న స్టేడియం పేరును నరేంద్ర మోదీ అనే పేరును మార్చారని, అలాంటి తప్పు తాము చేయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.