మరో కొత్త రికార్డును సొంతం చేసుకున్న ఛావా!
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం ఛావ. ఈ చిత్రం ఫిబ్రవరి 14, 2025 న రిలీజ్ అయ్యి కలెక్షన్ లలో దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 727 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో 555 కోట్ల వసూళ్లతో అనిమల్ (553 కోట్లు), జవాన్ (543 కోట్లు) లను దాటేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో 8వ స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుంది. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లలో ఆడుతుంది కాబట్టి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సంపాదించుకుంది.
విక్కీ కౌశల్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా A.R.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. విక్కీ చేసిన సినిమాలలో అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే.