డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
◆ నవంబరు 30 నుంచి మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టీటీడీ తెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుమన్నామని పేర్కొంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం కానుంది. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తామని గదులు కూడా అక్కడే మంజూరు చేస్తామని టీటీడీ ప్రకటించింది.

