ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,నిర్మించిన భవనాల పరిస్థితి,రైతలను ఇబ్బంది పెట్టిన పరిస్థితిపై సీఎం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. కాగా ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సీఎం వివరించారు. అయితే గత ప్రభుత్వ పాలనను చూసిన తర్వాత మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు. కాగా అమరావతికి ఎంతో సెంటిమెంట్ ఉందని సీఎం తెలిపారు. దేశంలోని పవిత్ర దేవాలయాల నుంచి తెచ్చిన మట్టిని తీసుకు వచ్చి అమరావతి శంకుస్థాపన చేశామన్నారు. అయితే ఏపీకి ఎటువైపు నుంచి చూసిన అమరావతి నడిబొడ్డున ఉంది అన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సైబరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని సీఎం పేర్కొన్నారు. బ్రిటీష్ మ్యూజీయంలో కూడా అమరావతికి ప్రత్యేక గ్యాలరీ ఉందన్నారు. అయితే రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదన్నారు.