Andhra PradeshHome Page Slider

అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో, రిమాండ్‌ను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున చంద్రబాబు రిమాండ్, కస్టడీని పొడిగించాలని సీఐడీ కోరింది. అక్టోబర్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.