‘బడ్జెట్ పెట్టాలంటే చంద్రబాబు భయపడుతున్నారు’..జగన్
తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లయినా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ప్రజలు సూపర్ 6 గురించి అడుగుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ఓటాన్ ఎకౌంట్‌తో ఇన్నాళ్లుగా నడిచే ప్రభుత్వం ఎక్కడా చూడలేదని, ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచినా సూపర్ సిక్స్ లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లు తయారయ్యిందన్నారు.