జైలు నుండి ఇంటికి వస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ – జనసేన ఉమ్మడి సమావేశం జరుగుతున్న రోజున చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే-ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చంద్రబాబును 53 రోజులు మిక్కిలి కష్టపెట్టారు. ఆలస్యం కావచ్చు.. కానీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది. బాస్ ఈజ్ బ్యాక్. వైకాపా నేతలకు.. స్కిల్, డెవలప్‌మెంట్‌కు అర్థం తెలియదు. అప్పులు చేయడం, బిచ్చం వేయడమే అభివృద్ధి అని ఆ పార్టీ అనుకుంటోంది.