Home Page SliderNational

మణిపూర్ కేసు సీబీఐకి అప్పగించిన కేంద్రం

మణిపూర్ ఘర్షణ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. మణిపూర్‌లో జరుగుతున్న అరాచక సంఘటనలపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా కూడా ఏనాడూ ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాలేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్ సభ, రాజ్యసభ ప్రతిరోజూ వాయిదాలు పడుతున్నాయి. ఈ కేసును మణిపూర్‌ రాష్ట్రంలో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగిస్తే న్యాయం జరుగుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ కేసు విచారణను 6 నెలలలోగా పూర్తి చేయాలని, సీబీఐని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ ఘటన అతి హేయమైనదని, మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని, నేరస్తులకు సరైన శిక్ష పడితేనే మహిళలపై నేరాలు తగ్గుతాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈరోజు ఈ విషయంపై దాఖలయిన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అందుబాటులో లేకపోవడంతో ఈ కేసు వాయిదాపడింది.