రాజమండ్రిలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు
రాజమండ్రి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మరోసారి కేసు నమోదైంది. రాజమండ్రి 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లు, భారత సైన్యం, ఆంధ్రులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ స్వప్నపైనా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదు చేశారు.
గతంలోనూ వర్మపై వివిధ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.