మాజీ ఎమ్మెల్యే జోగురామన్నపై కేసు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్నపై బేల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదివారం బేల మండల కేంద్రంలో జోగురామన్న ఆధ్వర్యంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో సీఎం రేవంత్ బొమ్మను దహనం చేయడంతో పాటు సీఎం రైతు ద్రోహి, సీఎం రేవంత్ 420 అంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు సీఎం ఫ్లెక్సీ దహనం చేసినందుకు జోగురామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు బేల ఎస్సై రాధిక తెలిపారు.