‘ఇకపై సహించేది లేదు..తాడో పేడో తేల్చుకుందాం’..కేటీఆర్
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. తనపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పారు. కోర్టులో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశానని, తాడో పేడో తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు. రాజకీయంగా ఉంటే చూసుకోవాలని, కానీ ఆధారాలు లేకుండా పిరికిపందలా నీచమైన ఆరోపణలు చేస్తే ఊరుకోనని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెపై వేసిన దావా ఇలాంటి వారికి గుణపాఠం కావాలని అన్నారు.