‘పేరు పెట్టి పిలిచా..తిట్టలేదు’..కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. మాటల సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు కేటీఆర్. దీనితో స్పీకర్ అభ్యంతరం చెప్తూ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని ఏకవచనంతో మాట్లాడకూడదని కేటీఆర్‌కు సూచించారు. దీనితో కేటీఆర్ స్పందిస్తూ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని, వారు ప్రతిపక్షనాయకుడు కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయినా తాను పేరు పెట్టి పిలిచానని, తిట్టలేదని వివరణ ఇచ్చారు కేటీఆర్. బీఆర్‌ఎస్ పరిపాలనా కాలంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు కేటీఆర్.

