Home Page SliderTelangana

సినీ నటుడు ఇంట్లో చోరీ

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లి నివాసంలో రూ. 10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పని మనిషి నాయక్ ఆ డబ్బును దొంగతనం చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పని మనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.