డబ్ల్యూటీసీ విజేతలకు బంపర్ ప్రైజ్..ఎన్ని కోట్లంటే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు జూన్ 11 నుండి 15 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ పోరులో క్రికెట్ దిగ్గజాలు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడతాయి. అయితే విజేతలకు ఈసారి బంపర్ ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. గతంతో పోలిస్తే డబుల్ క్యాష్ ప్రైజ్‌ను పొందనున్నాయి. విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.31 కోట్లు. రన్నరప్‌కు కూడా 2.1 మిలియన్ డాలర్లు, సుమారు రూ.18 కోట్ల నగదు బహుమతిని అందకోబోతున్నాయి ఈ రెండు టీమ్‌లు. గతంలో 2021-23 ఫైనల్లో విజేత ఆస్ట్రేలియా రూ. 13.68 కోట్లు దక్కించుకుంటే, రన్నరప్ భారత్ రూ.6.84 కోట్లు సంపాదించింది. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యాన్ని పెంచడానికే ప్రైజ్ మనీ రెండింతలు చేశామని ఐసీసీ పేర్కొంది. ఇప్పుడు మూడవస్థానంలో ఉన్న భారత్‌కు కూడా రూ.12 కోట్లు ప్రైజ్‌మనీ లభించనుంది.