ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31న సమావేశాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 13 వరకు కొనసాగనున్నాయి. వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్ పై ఉభయ సభల్లో చర్చ ఉంటుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు నిర్వహించనున్నారు.