బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు, జహీరాబాద్ బీజేపీ ఎంపీ సీటు ఖరారు
జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కు బీజేపీ జహీరాబాద్ ఎంపీ స్థానం ఖరారు చేసింది. 2014, 2019లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈసారి ఆయన బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిన్ననే ఆయన బీజేపీలో చేరారు. ఇక నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ రాములు తనయుడు భరత్ ను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక మాజీ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు పార్టీ భువనగిరి స్థానం ఖరారు చేసింది.