పీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ డుమ్మా
చైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కమిటీ సభ్యులు, సీఎస్ శాంతి కుమారి హాజరు కాగా.. బీఆర్ఎస్ డుమ్మా కొట్టింది. పీఏసీ చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. గులాబీ పార్టీ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్ గా కేసీఆర్ నియమించారని గుర్తు చేశారు.