తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ
ప్రముఖ బాలీవుడ్ హీరోయన్, ఇటీవల ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకులను అలరించిన బ్యూటీ కియారా అధ్వాణీ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలో తల్లి కాబోతున్నానని వెల్లడించింది. 2023లో తన చిరకాలమిత్రుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్‌హోత్రాను వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కియారా తెలుగులో తొలిసారిగా మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అనంతరం రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించినా అది విజయం సాధించలేదు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్‌తో నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో ఆమె అభిమానులు నిరాశ చెందారు. తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ బేబీ సాక్స్‌ను చేతితో పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు ఈ దంపతులు.
