NationalNews

గుజరాత్‌లో ఢిష్యుం.. ఢిష్యుం…

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి హిందూ వ్యతిరేక ప్రకటనలపై గుజరాబాత్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఆ పార్టీ మద్దతుదారులు ఈ రోజు పార్టీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ల ర్యాలీకి ముందు ఆ పార్టీ బ్యానర్లు చించేశారు. డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో AAP విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇవాళ ఆ పార్టీ తిరంగా యాత్ర నిర్వహించాల్సి ఉండగా నిరసనలు, విధ్వంసం స్వాగతం పలికాయి. బీజేపీ నేతల తీరు చూస్తుంటే ఓటమి భయం వారికి కలుగుతోందన్నారు ఆప్ సీనియర్ నేత దుర్గేష్ పాఠక్.

హిందూ దేవుళ్లను నిందించడంతో సహా బీఆర్ అంబేద్కర్ యొక్క 22 ప్రమాణాలను పునరావృతం చేసిన వేలాది మందిలో ఆయన కూడా బౌద్ధమతంలోకి సామూహిక చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రమాణం చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులపై విశ్వాసం లేదని వారిని పూజించడం లేదంటూ ఆయన కామెంట్ చేశారు. హిందూ మతాన్ని అవమానిస్తారా అంటూ ఇవాళ ఆ పార్టీ అగ్రనేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాను కొత్తగా ఏమీ చెప్పలేదని… 1956లో అంబేద్కర్ ప్రతిజ్ఞను పునరావృతం చేశానన్నారు ఆ పార్టీ నేతల గౌతమ్. ఓవైపు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగినా… ఆప్ మాత్రం కార్యక్రమాన్ని యాధావిధిగా నిర్వహిస్తోంది.