ఏడోసారి అధికారం కోసం బీజేపీ తహతహ
గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని ఆశిస్తోంది. తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ను పక్కకు నెట్టగలిగామని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నతరుణంలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న 89 సీట్లు కచ్, సౌరాష్ట్ర ప్రాంతంలోని 19 జిల్లాలు రాష్ట్రంలోని దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీకి, సంఖ్యాబలం తగ్గడమే అసలైన సవాలు. 2002 నుంచి పార్టీ సీట్లు కొంత తగ్గుతున్న అధికారాన్ని మాత్రం ఆ పార్టీ నిలబెట్టుకుంటోంది. 2018 ఎన్నికల్లో 137 నుంచి 99కి బీజేపీ బలం తగ్గింది. రాష్ట్రంలోని 182 సీట్లలో 140 సీట్లను పార్టీ లక్ష్యంగా పెట్టుకుని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. హై-ప్రొఫైల్ నేతలతో బీజేపీ హై వోల్టేజ్ ప్రచారం నిర్వహించింది.

రాష్ట్రంలో గత నెలలో ఎక్కువ కాలం గడిపిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజయంపై కన్నేసినా.. అసలు ఆ పార్టీ గుజరాత్‌లో ఖాతా తెరుస్తుందా లేదా అన్న అనుమానాలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో సాధించిన భారీ విజయంతో ఉల్లాసంగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గుజరాత్‌లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుజరాత్‌లో 2018 ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైన ఆప్ — 92 సీట్లు, వాటిలో 8 సూరత్‌లోనే గెలుస్తుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఢిల్లీలో పార్టీ పాలనా నమూనాతో దూసుకెళ్తున్న ఆప్ విద్య, ఆరోగ్యంపై ఫోకస్ పెంచింది. ఆప్ గుజరాత్ ప్రజల మనస్సులో ఎక్కడా లేదని…. ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉండండన్నారు. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆప్ పేరు కనిపించకపోవచ్చన్నారు.

2018లో 77 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, బ్యాలెట్ బాక్సులను హోంగార్డులు లేదా రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో కాకుండా కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. త్రిపుర రైఫిల్స్‌ను 1.5 కి.మీ దూరంలో ఉండాలని కోరినట్లు కూడా పేర్కొంది. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. గత సారి ప్రచారానికి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. పాదయాత్ర 3,750 కి.మీ మార్గం ఎన్నికలకు వెళ్లే రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో ఒక్కరోజు మాత్రమే ప్రచారం చేశారు. డిసెంబర్ 5న రెండో దశ పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
