తెలుగు రాష్ట్రాలలో బీజేపీ దూకుడు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ దూకుడు పెంచింది. విసృతంగా ప్రచారాలు, సమావేశాలు నిర్వహించబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న శ్రీకాళహస్తి రాబోతున్నారు. 11 వతేదీన అమిత్‌షా విశాఖకు రాబోతున్నారు. 15న ఖమ్మంలో పర్యటించబోతున్నారు అమిత్ షా. రాబోయే ఆరు నెలల కాలంలో తెలంగాణాకు, మరొక ఆరు నెలలు పోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రాబోతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో జాతీయ నేతలంతా తెలుగురాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. నడ్డా పర్యటన సందర్భంగా శ్రీకాళహస్తి మొత్తం కాషాయ రంగు జెండాలతో ముస్తాబయ్యింది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడడంతో ఇంకా పర్యటనలో జోరు పెంచుతున్నారు. నడ్డా, అమిత్ షాల బహిరంగ సభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు. వచ్చే 15 రోజులలో తెలుగు రాష్ట్రాలలో నాలుగు చోట్ల పర్యటించడం ఎంతో కీలకంగా మారింది. రాయలసీమలో జరగబోతున్న బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన బోతున్నారు.