ఇండియాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మే 4న భారత్‌లో పర్యటించనున్నాడు. 2014లో నవాజ్ షరీఫ్ తర్వాత పాక్ అధినేత తొలిసారిగా ఇండియాకు రానున్నాడు. ఇండియాలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇండియాపై పరుష వ్యాఖ్యలతో బిలావల్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. దివంగత బెనజీర్ భుట్టో తనయుడిగా బిలావల్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఇమ్రాన్ ఖాను ను పదవిలోంచి దించేసిన తర్వాత ఏర్పడిన సంకీర్ణ సర్కారులో బిలావల్ కీలక విదేశాంగ మంత్రి పదవి దక్కించుకున్నాడు.