Home Page SliderNational

“భళా భారత్ బౌలర్స్..కష్టాల్లో పాక్”

దేశవ్యాప్తంగా ఇప్పుడు వరల్డ్ కప్ మేనియా నడుస్తోంది. అయితే ఈ రోజు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో ఈ ఫీవర్ ఇంకాస్త ఎక్కువైంది. ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు దాయాదుల పోరు  ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనికి కారణం గతంలో ఆడిన మ్యాచ్‌లన్నింటిలో ఇండియా ఛేజింగ్ లోనే పాకిస్తాన్‌పై విజయం సాధించింది. అందుకే సెంటిమెంట్ ప్రకారం మొదట బ్యాటింగ్ చేసే అవకాశం పాకిస్తాన్‌కే ఇచ్చింది. అయితే భారత్-పాక్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్స్ విజృంభించి 34 ఓవర్లలో 6 వికెట్లు తీశారు. కాగా వారు కేవలం 14 పరుగుల్లోనే 4 వికెట్లు తీసి ఔరా అనిపించారు. దీంతో పాక్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాకిస్తాన్ 34 ఓవర్లలో 168 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అయితే  ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆఫ్ సెంచరీతో చేయగా.. రిజ్వాన్ 49 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు.