Home Page SliderNational

ఉద్రిక్తంగా మారిన భారత్ బంద్

భారత్ బంద్ నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నిరసనగా కొనసాగుతున్న ఈ బంద్ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. బస్సులు, వ్యాపారాలు, ఎస్సీ సంఘాల నేతలు బలవంతంగా మూసేయిస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనలు చెలరేగిన చోట్ల పోలీసులు లాఠీచార్జ్‌లు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ బంద్ ప్రభావం అంత తీవ్రంగా లేదనే చెప్పాలి. పాఠశాలలు మాత్రం సెలవులో ఉన్నాయి. అనేక ప్రాంతాలలో బస్సులు బాగానే నడుస్తున్నట్లు సమాచారం.