శాకంబరిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ
బెజవాడ దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మాతగా దర్శనమిచ్చారు. శాకంబరి అంటే జీవులకు ప్రాణం నిలబెట్టే ఆహారాన్నిచ్చే తల్లి. ఈ అలంకారంలో భాగంగా దుర్గ గుడి అంతా కాయగూరలతో, ఆకుకూరలతో అందంగా అలంకారం చేశారు. మూడు రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈరోజు మొదటి రోజు కావడంతో అమ్మవారి మూలవిరాట్టును కూడా కూరగాయలతో, పండ్లతో అలంకరించారు. ఇతర ఉపాలయాలకు, ఆలయానికి కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకాలంకారములు చేశారు.


