పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై BMWను నడిపిన ఏపీ ఎంపీ కూమార్తెకు బెయిల్
పూణె పోర్స్చే ప్రమాదం జరిగిన ఒక నెలలోపే హై-ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన హిట్-అండ్-రన్ కేసులో, రాజ్యసభ ఎంపీ కుమార్తె, చెన్నైలోని పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై తన BMWను నడిపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గాయపడిన వ్యక్తి మృతి చెందగా, మహిళకు బెయిల్ వచ్చింది. సోమవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి తన స్నేహితురాలితో కలిసి బీఎండబ్ల్యూ కారు నడుపింది. చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని పేవ్‌మెంట్‌పై మద్యం మత్తులో నిద్రిస్తున్న 24 ఏళ్ల సూర్య అనే పెయింటర్‌పై ఆమె కారు నడిపింది. మాధురి వెంటనే అక్కడి నుంచి పారిపోగా, ఆమె స్నేహితురాలు కారు దిగి ప్రమాదం జరిగిన తర్వాత గుమిగూడిన వారితో వాగ్వాదానికి దిగిందని అధికారులు తెలిపారు. కొంతసేపటి తర్వాత ఆమె కూడా వెళ్లిపోయింది. గుంపులోని కొందరు వ్యక్తులు సూర్యను ఆసుపత్రికి తరలించారు, అయితే అతను తీవ్రంగా గాయపడ్డాడు. సూర్యకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతని బంధువులు, కాలనీకి చెందిన ప్రజలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ J-5 శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కారు బీఎంఆర్ బీద మస్తాన్‌రావు గ్రూప్‌నకు చెందినదని, పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మాధురిని అరెస్టు చేసినా పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ మంజూరయ్యింది. బీదామస్తాన్ రావు 2022లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సముద్ర ఆహార పరిశ్రమలో BMR గ్రూప్‌నకు విశేషమైన పేరుంది.