అల్లు అర్జున్‌కి బెయిల్
సినీ హీరో అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులిచ్చింది. సంధ్య థియేటర్ ఘటన కేసులో హైకోర్టు కండీషన్ బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్‌కి ఊరట కల్పించేలా నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.అల్లు వారి అబ్బాయికి బెయిలా ,జైలా అనే ఉత్కంఠ,ఊహాగానాలకు తెరదించుతూ.. అర్జున్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు శుక్రవారం సాయంత్రం బెయిల్ ఇష్యూ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తర్వాత అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది.