మందు ప్రియులకు బ్యాడ్ న్యూస్..
మందుబాబులకు చేదు వార్త.. హైదరాబాద్ సిటీ శివార్లలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు వైన్స్ మూతపడనున్నాయి. ఫిబ్రవరి 25 ఉదయం 6:00 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు మూసివేయబడతాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మూసివేయబడతాయని తెలిపారు.