CBI విచారణకు అవినాష్ రెడ్డి మళ్లీ డుమ్మా
వివేకా హత్యకేసులో సీబీఐ నిందితుడిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు కూడా సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. తన తల్లి అనారోగ్యం కారణంగా తాను పులివెందులకు వెళ్లాలని, అందుకే విచారణకు రాలేనని సీబీఐకు లేఖ వ్రాసారు. నాలుగురోజుల క్రితం తనకు ఆరోగ్యం బాగోలేదంటూ విచారణకు హాజరు కాలేదు. అయితే మే 19న రమ్మంటూ సీబీఐ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టు రద్దు చేయడంతో తెలంగాణా హైకోర్టు వాయిదా వేసింది. అందుకే సీబీఐ విచారణ పేరుతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ప్రచారం జోరుగా సాగింది. తనకు ఈ హత్యతో సంబంధం లేదని, తనను కావాలని, సీబీఐ, వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు అవినాశ్ రెడ్డి.