ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న అవినాష్ రెడ్డి
వివేక హత్య కేసు విచారణ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటోంది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిందిగా, కోరడంతో కోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేసు విచారించనుంది. కేసు విచారణ నేపథ్యంలో సీబీఐ, అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో, అవినాష్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుండగా… మరోవైపు సీబీఐ విచారణ మరికొద్దిసేపట్లో జరగనుంది. ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే సీబీఐ అవినాష్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ విచారణ కోసం పులివెందులలో ఉన్న ఆయన కాసేపట్లో హైదరాబాద్ వస్తారు.