NewsTelangana

మాదాపూర్‌లో హుక్కా సెంటర్లపై దాడులు

హైదరాబాద్ మహనగరంలో పోలీసుల కళ్లుగప్పి అనేక మత్తు స్థావరాలను కొంతమంది నడిపిస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవరిస్తూ వీటికి బ్రేక్ వేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు హైదరాబాద్‌ మాదాపూర్‌లో హుక్కా సెంటర్లను నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ హుక్కా సెంటర్‌లో ఉన్న 24 మంది కస్టమర్లు, 4గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అయితే  నిర్వాహకులు బ్యాక్‌యార్డ్ పేరుతో ఈ హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి ఆ హుక్కా సెంటర్ నిర్వాహకులను పట్టుకున్నారు. అనంతరం హుక్కా సెంటర్‌లో దొరికిన  కస్టమర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.