తనిఖీలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి
కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తనిఖీలకు వెళ్లిన ఈడీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో జరిగింది. హై ఇంటెన్సిటీ యూనిట్ ఆఫీసర్లు దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్ వర్క్ తో కలిసి ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ బిజ్వాసన్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ లో సోదాలు చేస్తుండగా ఐదుగురు దుండగులు వచ్చి అధికారులపై దాడి చేశారు. ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్ కు గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు.

