విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్‌పై దాడి
విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగుతున్న సమయంలో ఆగంతకుడు రాయి విసిరాడు. మేమంతా సిద్ధం యాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. సింగ్ నగర్ లో అభివాదం చేస్తుండగా సీఎం కనుబొమ్మ పై భాగంలో గాయమైంది. క్యాట్ బాల్ తో దాడి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యులు వెంటనే ప్రాధమిక వైద్యం అందించారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు కంటికి సైతం గాయమయ్యింది. దాడి జరిగిన ప్రాంతంలో ఓవైపు స్కూలు, మరోవైపు భవనాలున్నాయి. ఐతే ట్రీట్మెంట్ తర్వాత జగన్ యాత్ర కొనసాగించారు.


