నంద్యాలలో దారుణం-చిన్నారిని చిదిమేసిన మైనర్ కామాంధులు
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని 8ఏళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్ కామాంధులు పొట్టనపెట్టుకున్నారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి వద్ద ఎల్లాల గ్రామానికి చెందిన ఈ బాలిక మూడు రోజుల నుండి కనబడడం లేదని ఆమె తండ్రి నందికొట్కూరులో ఫిర్యాదు చేశాడు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం సాయంత్రం పార్కు వద్ద ఆడుకుంటున్న బాలికను సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు అంగీకరించారు. ఈ విషయం బయటపడకుండా ఆమెను కాల్వలోకి తోసేశామని తెలిపారు. దీనితో పోలీసులు ఆమె కోసం జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.