ట్రైన్ లో ఏటీఎం..
ఇండియన్ రైల్వే శాఖ కొత్త ప్రయోగాన్ని శ్రీకారం చుట్టింది. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో దేశంలోనే మొట్టమొదటి ఆన్‌బోర్డ్ ATM ప్రవేశపెట్టింది. మన్మాడ్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడుస్తున్న పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో సెంట్రల్ రైల్వే ప్రయోగాత్మక ప్రాతిపదికన ATM యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ATM ఒక AC చైర్ కార్ కోచ్‌లో అమర్చబడి ఉంటుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేకమైన చర్య తీసుకోబడింది. ఇది విజయవంతమైతే, ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలో కూడా ప్రారంభిస్తామని రైల్వే అధికారి తెలిపారు.