Home Page SliderNational

సిక్కింలో భారీ వర్షాలకు 14 మంది మృతి

ఈశాన్య రాష్ట్రామయిన సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలతో సిక్కింలోని తీస్తానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సిక్కిం రాష్ట్రంలో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. ఈ వరదల దాటికి ఇప్పటికే 14 మంది మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా 23మంది ఆర్మీ జవాన్లతోపాటు 102మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా తీస్తానది ఉగ్రరూపం దాల్చడంతో సిక్కింలో ఇప్పటి వరకు 14 వంతెనలు కూలిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పశ్చిమబెంగాల్,సిక్కిం రాష్ట్రాన్ని కలిపే 10వ నంబరు జాతీయ రహదారి కూడా వరదల దాటికి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం సహయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.