Home Page SliderInternational

జపాన్ ప్రధానిపై హత్యాయత్నం

జపాన్‌లో మాజీ ప్రధాని షిండో అబే హత్య ఘటన మరువక ముందే.. తాజా ప్రధానిపై హత్య యత్నం కలకలం రేపింది. పేలుడు శబ్దం వినిపించడంతో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాను వాకయామాలోని ఓడరేవు నుంచి భద్రతా సిబ్బంది సురక్షితమైన స్థావరానికి తరలించారు. ఈ ఘటనలో ఆయన క్షేమంగా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ప్రధానిపై “స్మోక్ బాంబ్” విసిరినట్లు తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. పశ్చిమ జపాన్‌లోని వాకయామాలో కిషిదా ప్రసంగించడానికి వచ్చిన ప్రదేశంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ మీడియా NHK పేర్కొంది. స్థానిక పోలీసులు వ్యాఖ్యానించడానికి నిరాకరించడంతో ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనుమానంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. జూలై 2022లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో మాజీ ప్రధాని షింజో అబేను దుండగడు హత్య చేయడంతో, ప్రధాని భద్రతను అధికారులు భారీగా పెంచారు. జపాన్ ఉత్తర సపోరోలో, నాగానోలోని కరుయిజావా నగరంలో G7 మంత్రిత్వ కార్యక్రమాలతోపాటుగా, హిరోషిమాలో శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సంఘటన జరగడంతో, భద్రతను పోలీసులు కట్టదిట్టం చేశారు.