అవినాశ్ రెడ్డి పీఏ అరెస్టు
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందులలో అరెస్టు చేశారు. వర్రా రవీంద్రరెడ్డి కేసులో అతనికి సంబంధం ఉందంటూ రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో ఇప్పటికే వర్రా రవీంద్రరెడ్డి కేసులో 112 మందికి పైగా నిందితులను చేర్చారు. రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పులివెందుల అర్బన్ పీఎస్‌కు తరలించారు.