Home Page SliderTelangana

ఇలా పథకాలు ఇస్తూ పోతే ప్రజలు సోమరిపోతులు కారా? చినజీయర్

హనుమాన్ జంక్షన్: ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా తయారు చేస్తున్నారని చినజీయర్ స్వామి విమర్శించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ కొత్త యూనిట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి, పోతే ఒకటి, కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి ఇలా పలురకాలుగా ప్రతి దానికీ రాయితీలు ఇస్తూ పోతే ప్రజల్ని బద్ధకస్తులుగా, బలహీనులుగా తయారు చేస్తున్న ప్రభుత్వం అనిపిస్తోంది. అన్నీ కాళ్లకాడకి వస్తుంటే ఇంక పనిలోకి వెళ్లేవారు ఎవరు ఉంటారని చినజీయర్ స్వామి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.