Andhra Pradesh

AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLRB) నవంబర్ 28, సోమవారం నాడు AP పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022ని విడుదల చేసింది. 411 సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/లో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎస్‌ఐ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 19న, కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న నిర్వహించనున్నారు. హోంగార్డులకు సివిల్ కానిస్టేబుళ్లలో 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లలో 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.