ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ స్కీంలో కొత్తగా 809 చికిత్సలను చేర్చినట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను పెంచారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ కింద మొత్తం చికిత్సల సంఖ్యను 3,255కు పెంచినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడిన ఇతర రాష్ట్రాల వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.