Andhra PradeshHome Page Slider

రేపు ప్రధానితో భేటీ కానున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. కాగా రేపు ఉదయం 10:15 గంటలకు సీఎం ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం రాష్ట్రానికి ఆర్థిక సాయం,ఇతర అంశాలను వివరించనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రేపు మధ్యహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు. అయితే వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,పోలవరం,అమరావతి తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.