పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం జగన్
ఈ రోజు విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. సభలో మొదటిగా సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం ఈ సభలో పోలీసుశాఖను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. పోలీసులకు వీక్లి ఆఫ్‌లు అమలు దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసుశాఖలో సిబ్బంది కొరతతోనే వీక్లి ఆఫ్‌లు కష్టమవుతున్నాయన్నారు. సీఎం జగన్ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామి ఇచ్చారు. చిత్తూరు,ప్రకాశం,రాజమండ్రిలో ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటు చేశామన్నారు. మన ప్రభుత్వంలో దళిత మహిళకే హోంమంత్రిగా అవకాశం ఇచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫిర్యాదులు పెరిగాయి కాబట్టే.. నేరాలు తగ్గుముఖం పట్టాయని సీఎం జగన్ వెల్లడించారు.