Andhra PradeshHome Page Slider

శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్

విజయవాడలోని శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. ఆరు రోజుల క్రితం ప్రారంభమైన ఈ యజ్ఞంలో మొదటి రోజు, చివరి రోజైన ఈ రోజు జగన్ ఈ హోమాలను నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ, రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక మహాచండీ యాగం, రాజశ్యామయాగం, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చివరిరోజుకు చేరుకున్నాయి. రాష్ట్రప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ ఈ యజ్ఞాన్ని ప్రారంభించారు. గతంలో తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ యాగాలు చేసారని, జగన్ కూడా రెండవసారి ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఈ యజ్ఞాలు నిర్వహిస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.