Andhra PradeshHome Page Slider

ఈనెల 20న ఏపీ క్యాబినెట్ కీలక భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20న జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది. రెండు నెలల అనంతరం జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపద్యంలో జరిగే క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే కొన్ని ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులు మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.