మరో భయంకర తుఫాను గుప్పిట్లో ఫ్లోరిడా
ఈమధ్యనే హెలెన్ తుఫాన్ ఫ్లోరిడాను కుదిపేసింది. అంతలోనే మరో తుఫాన్ చుట్టుముట్టనుంది. ఫ్లోరిడా తీరం వైపుగా మిల్టన్ హరికేన్ అతివేగంగా దూసుకొస్తోంది. ఇది ఐదవ కేటగిరీకి చెందిన హరికేన్‌గా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. మిల్టన్ హరికేన్ వచ్చే మార్గంలో విమానాశ్రయాలను మూసివేశారు. తుఫాన్ హెచ్చరికల వల్ల అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనివల్ల గంటకు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. దీనివల్ల నార్త్ కోలినా, జార్జియా, ఫ్లోరిడా, వర్జీనియా నగరాలలో ప్రభావం ఉండవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడమే తరచూ తుఫాన్లకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.